- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ సంకుచిత వైఖరి వల్లే ఓటమి: సీపీఐ నారాయణ
సీఎం విజయ్ విజయంపై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు. కాంగ్రెస్ సంకుచిత వైఖరి వల్లే ఓడిపోయామన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో విజయ్ గెలుస్తాడని, ముఖ్యమంత్రి అవుతాడని ఎవరూ ఊహించలేకపోయారని విజయ్‍ను అంచనా వేయడంలో కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని పార్టీలు విఫలమయ్యాయని సీపీఐ నారాయణ అన్నారు. ఓట్లు వస్తాయని చెప్పారే తప్ప అధికారంలోకి వచ్చేలా సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేకపోయారన్నారు. రాజకీయాల్లో జెన్ జీ కొత్త ట్రెండ్ సృష్టిస్తోందన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుదుచ్చేరిలో డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ కలిసి పని చేసి ఉంటే ఎన్డీయే ప్రభుత్వం వచ్చేదే కాదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ సంకుచిత వైఖరి వల్ల కూటమిని చెదిరిపోయిందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేత ధోరణిలోనే మాట్లాడుతున్నారని నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి అనే బాధ్యత లేకుండా, ప్రజల గ్రౌండ్ స్థాయి సమస్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఎన్నికల్లో ఎవరూ గెలిచే పరిస్థితులే లేవని ఎన్నికల సంఘం కూడా వారి పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు.






