TG: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. మరో రూ.387.53 కోట్లు విడుదల

by Prasad Jukanti |

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోటాలో మూడో విడత నిధులు రిలీజ్ చేసింది.

TG: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. మరో రూ.387.53 కోట్లు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: గ్రామ పంచాయతీలకు (Telangana, Gram Panchayats) కేంద్ర ప్రభుత్వం మరోసారి తీపి కబురు చెప్పింది. తాజాగా 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) కింద మూడవ విడతలో భాగంగా 387.53 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ. 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత కింద రూ. 387 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటివరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి. కేంద్రం నుంచి దశల వారీగా విడుదలైన నిధులలోనుంచి తెలంగాణ ఆర్థిక శాఖ గత మంగళవారం గ్రామ పంచాయతీలకు రూ. 256 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. కాగా దాదాపు 2 ఏళ్ల పాటు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఆలస్యం కావడంతో 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.

ఇంకా పెండింగ్ లో 200 కోట్లు:

గతేడాది డిసెంబర్ లో రాష్ట్రంలోని పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరడంతో కేంద్రం నుంచి నిధులు విడుదలవుతుండగా వాటిని క్రమంగా రాష్ట్రం పంచాయతీలకు రిలీజ్ చేస్తోంది. కాగా తెలంగాణకు కేంద్రం ఇంక రూ.2000 కోట్లు బాకీ ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కేంద్ర విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలని ఆదేశించారు.

Next Story