- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh: మహా కుంభమేళాలో దొంగ బాబాల కలకలం.. బాబాల వేషధారణలో మోసాలు!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులతో పాటు మరోవైపు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో (Maha Kumbh Mela) మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులతో పాటు మరోవైపు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వచ్చారు. అయితే కొందరు వ్యక్తులు బాబాల (Babas) వేషధారణలో వచ్చి (Frauds) మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. తాజాగా ఓ దొంగ బాబాను అక్కడున్న సాధువులు గుర్తించి బుద్ధి చెప్పారు. అతడి వంటిపై ఉన్న రుద్రాక్షల దండలను, సాధువుల వేశాధారణను తీయించేశారు. ఈ క్రమంలోనే దొంగ బాబా ఆ సాధువుల కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాడు.
ఇంకోసారి ఇలాంటి పని చేయనని అక్కడి నుంచి దొంగబాబా ఉడాయించాడు. మహాకుంభమేళాలో దొంగబాబాలతో సాధారణ భక్తులు అప్రమత్తంగా ఉండాలని సాధువులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రారంభమైన మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. (మంగళవారం) ఒక్క మకర సంక్రాంతి రోజునే దాదాపు 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.






