CM Revanth Reddy : అవమానం జరిగిన చోటనే ఆత్మగౌరవంతో నిలబడ్డారు : రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |

ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని..అద్భుతంగా వాడుకుని అవమానం జరిగిన చోటనే ఆత్మగౌరవంతో నిలబడ్డారని..హేళన చేసిన నోళ్లే శభాష్ అనేలా విధి నిర్వహణలో రాణిస్తున్నారంటూ(Excelling In Their Duties) ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్ల(Transgender Traffic Assistants)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా అభినందన(Congratulations_లు తెలిపారు.

CM Revanth Reddy : అవమానం జరిగిన చోటనే ఆత్మగౌరవంతో నిలబడ్డారు : రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని..అద్భుతంగా వాడుకుని అవమానం జరిగిన చోటనే ఆత్మగౌరవంతో నిలబడ్డారని..హేళన చేసిన నోళ్లే శభాష్ అనేలా విధి నిర్వహణలో రాణిస్తున్నారంటూ(Excelling In Their Duties) ట్రాన్స్ జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్ల(Transgender Traffic Assistants)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా అభినందన(Congratulations_లు తెలిపారు. భవిష్యత్ లో మీరు మరింత రాణించాలని..ఉన్నత విధుల నిర్వహణ కూడా చేపట్టే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 44మందిని ట్రాన్స్ జెండర్లను తొలిసారిగా ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగాల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో 39మంది హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం శిక్షణ విధులను పూర్తి చేసుకున్నారు. వారు అలాంటి ఉద్యోగాల్లో రాణించలేరన్న అంచనాల నుంచి నెల రోజులుగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సమర్థవంతంగా తమ విధులు నిర్వహిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. నగరంలోని వివిధ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వారు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో కొందరు రాబోయో కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు పోటీ పడేందుకు కోచింగ్ కు సిద్ధపడుతుండటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చు.

Next Story