- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Seethakka: పార్టీలకు వేలు ఖర్చు చేస్తారు.. హెల్మెట్‌కు మాత్రం ఖర్చు చేయరు: మంత్రి సీతక్క
ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలంటే అంతా రోడ్డు భద్రతను పాటించాలని మంత్రి సీతక్క సూచించారు.

()దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఇంట్లో సంతోషం ఉండాలంటే అంతా రోడ్డు భద్రతను పాటించాలని (Minister Seethakka) మంత్రి సీతక్క సూచించారు. ఇవాళ ఆసిఫాబాద్‌లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను సీతక్క ప్రారంభించారు. హెల్మెట్ ధరించి ఆమె భద్రతా ఉత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ.. బైక్‌లపై వెళ్లేవారు హెల్మెట్ (Helmet) అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలని సూచించారు. పార్టీలకు వేల రూపాయలు ఖర్చు చేసే మనం హెల్మెట్ కోసం ఓ వెయ్యి రూపాయలు ఖర్చు చేయకపోవడం బాధాకరం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మన తప్పుల వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడకూడదని మంత్రి సీతక్క అన్నారు.
అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం జంకాపూర్ లో మోడల్ అంగన్వాడి కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అంగన్వాడి చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్ లు పంపిణీ చేసి, బాలామృతం తినిపించారు. మంత్రి సీతక్క తో పాటు స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ తదితరులు ఉన్నారు.






