- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Aruna : వారికి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలి : ఎంపీ అరుణ
తెలంగాణ కేబినెట్(Telangana Cabinet)లో గిరిజనులకు ప్రాతినిధ్యం(Representation of Tribals) కల్పించాలని బీజేపీ ఎంపీ డీ.కే.అరుణ(BJP MP D.K. Aruna) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కేబినెట్(Telangana Cabinet)లో గిరిజనులకు ప్రాతినిధ్యం(Representation of Tribals) కల్పించాలని బీజేపీ ఎంపీ డీ.కే.అరుణ(BJP MP D.K. Aruna) డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో సహా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గిరిజన సంఘాలు ఎంపీకి అందించాయి. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ గిరిజన సంఘాల డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెలుతానని హామీ ఇచ్చారు.
గిరిజనుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ అభిమతమని అందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక కొత్త పథకాలు అమలు చేస్తు్న్నారని తెలిపారు. రాష్ట్ర కేబినెట్ లో గిరిజనులను విస్మరించడం సరికాదన్నారు. మొన్న లగచర్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల భూములు లాక్కోవాలని చూసిందని..నాకు ఓట్లేసి గెలిపించిన గిరిజనుల కోసం నేను పోరాడి అండగా నిలిచానన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర కేబినెట్ లో గిరిజనులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం బాధాకరమన్నారు. వారి న్యాయపరమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని అరుణ కోరారు.






