- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Konda Vishweshwar Reddy: వారి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకు.. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
కవిత ఎపిసోడ్ పై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్, కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ నుంచి నేతలు బయటకు వచ్చారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. తాను కూడా వారి వల్లే బీఆర్ఎస్ ను వీడాను తప్ప… కవిత చెప్పినట్లు హరీశ్ రావు వల్ల కాదన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్నారు. కవిత ఇప్పుడు అమాయకురాలిలా మాట్లాడుతున్నారని కవిత (Kavitha) అవినీతి చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఒకటే ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని రూల్ చేసిందని కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్ దేనన్నారు. హరీశ్ రావు (Harish Rao) కేవలం సంతకాలకే పరిమితం అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం అన్నారు. కాగా నిన్న పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్న సందర్భంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు కారణంగానే జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, విజయరామారావు లాంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొండా స్పందిస్తూ పై కామెంట్స్ చేశారు.






