నార్త్ ఇండియాలో నన్ను పాపులర్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-03 09:00:53  IST  )

నార్త్ ఇండియా (North India)లో తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నార్త్ ఇండియాలో నన్ను పాపులర్ చేస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నార్త్ ఇండియా (North India)లో తనను పాపులర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడి మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. నిన్న హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. డీసీసీల అంతర్గత సమావేశంలో తాను మాట్లాడిన స్పీచ్‌ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విధంగా తనను ఉత్తర భారతదేశంలో పాపులర్‌ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా అంటూ కామెంట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా హిందూ సమాజం లాంటిదే అని చెప్పేందుకు తాను ప్రయత్నం చేశానని అన్నారు. పార్టీలో సంస్థాగతంగా తీసుకు రావాల్సిన మార్పులు, స్థానిక ఎన్నికల వేళ వ్యవహరించాల్సిన తీరుపై డీసీసీల సమావేశంలో తాను మాట్లాడినట్లుగా వివరణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినా వారి తీరులో మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story