- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
75 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తున్నారు.. సీఎం బినామీ కంపెనీపై KTR హాట్ ట్వీట్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని టార్గెట్‌గా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని టార్గెట్‌గా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. KLSR ఇన్‌ఫ్రా టెక్ అనే సంస్థకు, సీఎంకు మధ్య ఉన్న సంబంధాలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దివాళా తీసిన కంపెనీకి రూ.వేల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు.
75 ఏళ్ల వృద్ధురాలి అరెస్టుపై ఆగ్రహం..
KLSR సంస్థపై న్యాయపోరాటం చేస్తున్న వ్యాపారవేత్త సౌరభ్ అగర్వాల్ తల్లి 75 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రా (KLSR Infra), ఒక 75 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోందని అన్నారు. ఆమె గొంతు నొక్కలేక అరెస్టు చేయించారు. పోలీసులను, ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కేటీఆర్ టార్గెట్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వృద్ధులను వేధించడమే కాంగ్రెస్ చెబుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’ మోడలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కేటీఆర్ ఆరోపణలు..
KLSR ఇన్‌ఫ్రా రేవంత్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీ అని, గతంలో రేవంత్ రెడ్డి వాడిన లగ్జరీ వాహనాలు కూడా ఈ కంపెనీ పేరుతోనే రిజిస్టర్ అయి ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండి, NCLATలో దివాళా ప్రక్రియ (Insolvency) ఎదుర్కొంటున్న కంపెనీకి రూ.6 వేల కోట్ల విలువైన ప్రభుత్వ పనులను ఎలా అప్పగిస్తారని ఆయన నిలదీశారు. ఈ కేసులో అనుకూల తీర్పు కోసం ఓ పెద్ద మనిషి ద్వారా న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని అన్నారు. మరోవైపు, సౌరభ్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో సీబీఐ, ఈడీ విచారణ జరపాలని బాధితుడు కోరుతున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు ఈ వివాదంలో వినిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.






