కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయాలంటే అవి తప్పనిసరి : గూగుల్ మాజీ అధికారి

by Muthe.Rajitha |

కార్పొరేట్ కంపెనీలు తమ ఇంటర్వ్యూల సెలక్షన్ కోసం స్కిల్, విల్, కల్చర్ లను చూస్తారని, యువత వీటిని అలవరచుకుంటే ఉద్యోగాలు పొందడం సులభమని గూగుల్ అండ్ డెల్ కంపెనీలలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం 2 ఎక్స్ ఫౌండర్, సీఈఓగా పనిచేస్తున్నకిరణ్ బాబు అన్నారు.

కార్పొరేట్ కంపెనీల్లో పనిచేయాలంటే అవి తప్పనిసరి  : గూగుల్ మాజీ అధికారి
X

దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేట్ కంపెనీలు తమ ఇంటర్వ్యూల సెలక్షన్ కోసం స్కిల్, విల్, కల్చర్ లను చూస్తారని, యువత వీటిని అలవరచుకుంటే ఉద్యోగాలు పొందడం సులభమని గూగుల్ అండ్ డెల్ కంపెనీలలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రస్తుతం 2 ఎక్స్ ఫౌండర్, సీఈఓగా పనిచేస్తున్నకిరణ్ బాబు అన్నారు. ఛాట్ జీపీటీ టీమ్ ప్రమోటర్లలో ఒకరైన కిరణ్ బాబు 2012 లోనే తమ టీమ్ గూగుల్ లో పనిచేస్తున్నప్పుడు టి అంటే ట్రాన్స్ ఫార్మర్ గా గుర్తించి డెవలప్ చేసిన ఛాట్ జీపీటీ నేడు కోట్లాది మంది వాడుతున్నారని, యువతలో పనిచేసే స్కిల్ తో పాటుగా అంకితభావంతో పనిచేసే విల్ కూడా ఉండాలని, కస్టమర్లతో కనెక్ట్ అయిపోయే కల్చర్ ఉన్నపుడు ప్రపంచం వారికీ రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు. ఇందుకు ఉదాహరణ ప్రపంచ సాఫ్ట్ వేర్ రంగం దిగ్గజాలైన గూగుల్ కంపెనీకి సుందర్ పిచ్చాయ్ సీఈఓ గా ఉంటే, మైక్రో సాఫ్ట్ కంపెనీకి సత్య నాదెళ్ల ఛైర్మెన్ అండ్ సీఈఓ గా పనిచేస్తున్నారన్నారు. ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా, మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్ మెంట్, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో జంటనగరాల్లో గుర్తించిన కాలేజీ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషన్ లర్నిoగ్ తదితర స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను నిర్వహిస్తున్న గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా 3వ స్కిల్ స్నాతకోత్సవం శుక్రవారం 4 ఏప్రిల్, 2025న జరిగింది.

ఈ సందర్బంగా హాజరైన కిరణ్ బాబు మాట్లాడుతూ, ప్రపంచ ఎకానమీ వంద ట్రిలియన్ డాలర్లుంటే, ఇండియా ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్లు ఉందని, 2030 నాటికీ ప్రపంచ ఎకానమీ మరొక 16 ట్రిలియన్ డాలర్లకు పెరిగితే ఇండియా మరొక్క ట్రిలియన్ డాలర్లకు మాత్రమే పెరిగే అవకాశం ఉందని, ‘డోంట్ థింక్ స్మాల్.. థింక్ బిగ్’ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ సలహాదారుల్లో ఒకరైన డాక్టర్ ఆర్. హఫీజ్ భాషా మాట్లాడుతూ స్టార్ట్ అప్ లను ప్రారంభించే యువత కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్నదన్నారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే వందకు పైగా ఇంక్యూబేషన్ సెంటర్లున్నాయని, యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. అలుమినస్ ఐఐటీ రూర్కీ కో ఫౌండర్ ప్రమోద్ చింతపెంట ఐటీ రంగంలో వస్తున్న నూతన మార్పులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెల్త్ కేర్, ఈ -కామర్స్, ఫైనాన్స్, ఈ -గవర్నెన్స్ ,లతో పాటుగా వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకుపోయిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు. టెక్నాలజీపై పట్టు సాధించినప్పుడే యువత ఇతరులకు ఉపాధి చూపించినవారవుతారన్నారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మొహమ్మద్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ యువత సమయానికి విలువ ఇవ్వాలన్నారు. ప్రతి క్షణం గొప్ప ఆలోచనలతో ఉండాలన్నారు.

ఇంజనీరింగ్ కాలేజ్ అఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు మాట్లాడుతూ మరొక 4800 మంది విద్యార్థులకు ఒక హైదరాబాద్ నగరంలోనే కాకుండా దేశంలో గుర్తించిన మరికొన్ని నగరాల్లో కూడా తమ కాలేజ్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తమ కాలేజీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. యువతలో అద్భుతమైన ఆలోచనలు దాగివుంటాయని, ప్రపంచానికి ఒక వినూత్న టక్నాలజీ అందించాలంటే వారిలో దాగిన ఆ విజ్ఞాన సంపదను వెలికి తీసినప్పుడు మాత్రమే ప్రయోజనంగా ఉంటుందన్నారు.సమావేశంలో విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెయింట్ జోసెఫ్ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు 107 మందికి స్కిల్ సర్టిఫికెట్స్ ను ప్రధానం చేశారు. కాలేజ్ ఛైర్మెన్ లక్ష్మి నారాయణతో పాటుగా పలువురు ఫాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం మొత్తం ఫాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం సెల్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ పి.సాయి కిషోర్, జూనియర్ ఫ్యాకల్టీ బి. మోహన్, సన్వేష్ కుమార్ అధ్యర్యంలో జరిగింది.

Next Story