- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ పనులు.. బీజేపీపై పొన్నం హాట్ కామెంట్స్
దేశంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కేంద్రంలోని బీజేపీ (BJP) కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని గేమ్స్ అడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కేంద్రంలోని బీజేపీ (BJP) కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని గేమ్స్ అడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. ఇవాళ సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad)లో ఎల్లమ్మ కట్టపై కొనసాగుతోన్న సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేషనల్ హెరాల్డ్’ (National Herald) కేసులో తమ అగ్ర నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్లను చేర్చడం దుర్మార్గమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచిన చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానికి ఉందని పేర్కొన్నారు. ఏళ్లుగా అధికారంలో ఉన్న అవినీతికి పాల్పకుండా ప్రజసేవకే అంకితమైన తమ నేతలపై బీజేపీ (BJP) క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతూ.. కాంగ్రెస్ (Congress) బలపడే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలు ఆయా రాష్ట్రాల్లో రూ.కోట్లలో అవినీతికి పాల్పడినా.. అవన్ని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి కనిపించవని కామెంట్ చేశారు. అన్ని పరిణామాలు ప్రజలకు గమనిస్తూనే ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు కేంద్రంలోని బీజేపీకి బుద్ధి చెబుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.






