ఆర్టీఐ కమిషనర్లుగా ఆ నలుగురు ఫైనల్.. ఓకే చేసిన గవర్నర్

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-05-12 12:10:44  IST  )

తెలంగాణలో ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కమిషనర్లుగా నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ఆర్టీఐ కమిషనర్లుగా ఆ నలుగురు ఫైనల్.. ఓకే చేసిన గవర్నర్
X

తెలంగాణలో ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కమిషనర్లుగా నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫైల్‌ను పంపింది. తాజాగా ఆయన ఆమోదం తెలపడంతో ప్రభుత్వం వారి నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

నిన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న చైనా, అమెరికా మధ్య సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్‌కు బ్రేక్ పడింది. ఈ మేరకు అమెరికా, చైనా పరస్పర సుంకాలను(టారిఫ్‌లు) తగ్గించుకునేందుకు 90 రోజుల ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తాత్కాలికంగా తగ్గించేదిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు దేశాలు అనూహ్యంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

ఏపీలోని అతిథి అధ్యాపకుల(గెస్ట్ ఫ్యాకల్టీ)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు పెంచుతూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి ఇప్పటివరకు గంటకు రూ.150 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.10 వేలు ఇచ్చేవారు. తాజాగా భారీగా వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అయితే ఈ వేతనాలు ఎంత పెరిగాయో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాల్సిందే.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఈ ఆపరేషన్ తర్వాత ప్రధాని తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే పీఎం మోడీ ఏం మాట్లాడుతారనే దానిపై దేశ ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంతకూ మోడీ ఏం మాట్లాడుతారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story