- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీళ్లు మంత్రులు కాదు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు: మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం
ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతలపై మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల (Velugumatla) భూదాన్ భూముల్లో నిర్మించుకున్న సుమారు 650 ఇళ్లను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయితే, తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లోని సామాన్లు సర్దుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా జేసీబీలతో తమ ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వెలుగుమట్ల భూదాన్ భూముల్లోని కూల్చివేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. "గాంధీ కుటుంబానికి రూ. వెయ్యి కోట్లు పంపుతానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రామిస్ చేశారు. అందుకే పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి డబ్బులు సిద్ధం చేయాలని చూస్తున్నారు" అంటూ ఫైర్ అయ్యారు.
పేదల ఇళ్లు కూలగొడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి తన రెండో ప్యాలెస్ కట్టుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోట ప్రహరీ గోడ కట్టడానికే కేవలం రూ.9 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘భట్టి గారు మూడో ఇల్లు కట్టుకుంటున్నారు, పొంగులేటి పదో కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నారు.. కానీ, నిరుపేదల జీవితాలను మాత్రం రోడ్డున పడేశారు’ అని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ అని.. వీళ్లు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.






