కాళేశ్వరం నివేదికతో నో ప్రాబ్లం.. గులాబీ బాస్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-04 09:23:06  IST  )

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బహిర్గతమై వేళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేతల కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం నివేదికతో నో ప్రాబ్లం.. గులాబీ బాస్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బహిర్గతమైన వేళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలు జగదీశ్ రెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. కేబినెట్‌కు కాళేశ్వరం నివేదిక అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్టు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ అంశంపై ఇవాళ్టి భేటీలో ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే సర్కార్ కావాలనే కమిషన్ నివేదికను మీడియాకు లీక్ చేసిందని మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నివేదిక వల్ల తమకు పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగానే ఎదుర్కోవాలని పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు.

Next Story