- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు..!
మహబూబ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది...

దిశ, వెబ్ డెస్క్: మహబూబ్ నగర్(Mahaboobnagar)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident)జరిగింది. పద్మావతి కాలనీ(Padmavati Colony)లోని అరేబియన్ నైట్స్ హోటల్(Arabian Nights Hotel)లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే హోటల్ రెండో అంతస్తులో ఆరుగురు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఓ టీమ్ మంటలార్పుతుండగా.. మరో టీమ్ మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఒక్కసారిగా హోటల్ నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భారీ ఎత్తున శబ్ధాలతో కూడిన మంటలు ఎగిసిపడుతుండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొంతసమయానికి తేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు స్థానికులు సైతం సహాయక చర్యలు అందించారు. మరోవైపు మంటలతో కూడిన పొగ కూడా చుట్టు ప్రాంతాల్లో అలుముకుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అటు స్థానిక పోలీసులు సైతం సహాయక చర్యలు అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేసింది. ఎండల తీవ్రతలు పెరుగుతుండటంతో హోటల్స్, షాపింగ్ మాల్స్, దాబాలు, ప్రైవేటు సంస్థలు, కెమికల్ కంపెనీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు.






