- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Arvind: పనితీరును బట్టే పదవులుండాలి.. అధ్యక్ష పదవిపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
by Prasad Jukanti |
పార్టీ అంతర్గత విషయాలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడి పదవి నేను కూడా అడిగానన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన అర్వింద్.. నేను అహంకారిని అనే ఆరోపిస్తుంటారు. నేను పార్టీలో చేరి 8 ఏళ్లు అయింది. ఎవరిపై అహంకారంతో ఉన్నాను? దీనికి జవాబు ఉండదన్నారు. పనితీరును బట్టి పదవులు ఇవ్వాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం అని బీజేపీ డిక్లేర్ చేసింది. ఈ విషయంపై నన్ను హైకమాండ్ అడింగింది. అందుకు తాను బీసీ సీఎం ఎందుకు డిక్లేర్ చేశారో మీకు తెలుసు. కానీ కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి సీనియర్ రెడ్డి నేతలు ఎవరూ అసెంబ్లీకి పోటీ చేయకపోతే బీసీ సీఎం డిక్లరేషన్ కు విలువ ఎక్కడుంటుంది అని నేను హైకమాండ్ ను అడిగానన్నారు. ప్రజల ముందు ఒక సందేశాన్ని పెట్టినప్పుడు అందుకు తగిన వ్యవహారం కూడా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఇష్టపడతారు లేదా ఇష్టపడరు. కానీ బీఆర్ఎస్ ను మాత్రం ద్వేషిస్తున్నారని అన్నారు. 2014 కు ముందు కేసీఆర్ కు ఫ్యాన్ కాని వారు ఎవరు లేరని, ఆ సమయంలో తానుకూడా కేసీఆర్ కు ఫ్యానేనంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ డిజాస్టర్ అని విమర్శించారు. కేటీఆర్, కవిత వల్ల కేసీఆర్ మరింత డిజాస్టర్ అయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ కు వారి భాషలోనే సమాధానం ఇస్తానని కవిత విషయంలో నేను ఎప్పుడు నోరు జారలేదన్నారు.నేను మాట్లాడితే అవతలి వారికి ఘాటుగానే తగులుతాయన్నారు. రాజకీయాల్లో నాకు ఏదైనా అవగాహన ఉంది అంటే కేవలం నా తండ్రి డి.శ్రీనివాస్ కారణం అన్నారు. ఆయనే నా రాజకీయ గురువు అన్నారు. చరిత్రలో ఆయన కంటే సక్సెస్ ఫుల్ పీసీసీ చీఫ్ ఎవరు లేరు మరెవరూ ఉండబోరన్నారు.
Next Story






