- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను కేబినెట్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. ఎట్టకేలకు తేల్చేసిన టీపీసీసీ చీఫ్
రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లోని రామ్‌లీలా మైదాన్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కేంద్రంలో స్వయంప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)ను జేబు సంస్థగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. ‘ఓట్ చోరీ’ విషయంలో కేంద్రానికి సెగ తగలాలనే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
కేబినెట్ ప్రక్షాళనపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్‌దేనని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. డీసీసీ (DCC) పదవుల్లో బీసీలకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందన్నారు. తాను కేబినెట్‌లోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పట్టుదలతో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్‌తో పాటు ఎవరూ పోటీ పడని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ (Congress) పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తే లేదని జోస్యం చెప్పారు. సోషల్ మీడియాను కేటీఆర్ మేనేజ్ చేస్తున్నారని.. తెలంగాణలో బీజేపీ ఎన్నటికీ అధికారంలోకి రాదన్నారు. బీఆర్ఎస్ పార్టీని నడిపించే సత్తా కేటీఆర్‌కు లేదని.. కేసీఆర్‌పై ప్రజలకు ఉన్న అభిమానం కేటీఆర్‌పై లేదన్నారు.






