కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు.. నేడు బెంగళూరుకు సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-22 05:12:53  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి బెంగళూరు (Bengaluru)కు బయలుదేరనున్నారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు.. నేడు బెంగళూరుకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ రాత్రి బెంగళూరు (Bengaluru)కు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వ్యక్తిగతంగా, పార్టీలో విభేదాలు తీవ్రం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం.

Next Story