- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయి.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, వెబ్డెస్క్: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్, పోలీసులు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ముకాయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి పని చేస్తున్నాయని.. కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో అమమతి ఇవ్వలేమని చెబుతున్నారని సాయంత్రం రహమత్నగర్ సభకు పర్మీషన్ ఇవ్వాలని ఈ నెల 4న దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి పోలీసులు స్పందించడం లేదన్నారు. సభ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్లు తమకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
హిందువుల సత్తా ఏంటో కాంగ్రెస్కు రుచి చూపించాలి..
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను బీజేపీ గెలుచుకుందని.. ఆ కుట్రతోనే తమ సభకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో లేదంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పేలా ఉందన్నారు. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ముస్లింల మెప్పు పొందేందుకు యత్నిస్తోందన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఐఎంసీ (ఇండియన్ ముస్లిం కాంగ్రెస్) మధ్యే పోటీ ఉంటుందని సెటైర్లు వేశారు. హిందువులంతా తమ సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించాలన్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని.. ఉప ఎన్నిక ముదే చేతులెల్తేసిందని కామెంట్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లేనని.. అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లేనని అన్నారు.
గోపీనాథ్ మరణంపై విచారణ జరిపించాలి..
సీఎం రేవంత్రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దేశ జవాన్లను అవమానించేలా హేళన చేసేలా మాట్లాడారని దుయ్యబట్టారు. మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. థన కొడుకు మరణం ఒక మిస్టరీ అని స్వయానా గోపీనాథ్ తల్లే చెబుతుండటం గమనార్హమని తెలిపారు. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్మెంట్లను రికార్డు చేయాలన్నారు. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లుగా గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్నా ఆరోపించారని గుర్తు చేశారు. అయినా సీఎం రేవంత్రెడ్డి గుండె మాత్రం కరగడం లేదన్నారు. ఎందుకంటే గోపీనాథ్ ఆస్తులపై సీఎం, ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల యవ్వారం ఉందని కామెంట్ చేశారు. అందుకే కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులపై విచారణ జరగడం లేదని.. అరెస్టులు అవ్వడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ అనుచరులెవరూ ప్రచారం కూడా చేయడం లేదని.. ప్రజలకు వాస్తవాలు అర్థం అయ్యాయని అన్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. చైన్ స్నాచర్లకు, గంజాయి విక్రేతలు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారుతుదని జోస్యం చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ గెలుపు తథ్యమని బండి సంజయ్ అన్నారు.
Read More... ‘ఆ పాపం వారిదే’.. గత ప్రభుత్వం పై ఎంపీ ఘాటు వ్యాఖ్యలు






