- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి కోసం తెస్తున్న డబ్బు చోరీ.. 4 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ
పెళ్లి (wedding) కోసం తీసుకొస్తున్న నగదు (cash)ను పట్టపగలే ఓ దొంగ (thief) చోరీ (stole) చేసిన ఘటన నారాయణపేట జిల్లా (Narayanpet district)లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి (wedding) కోసం తీసుకొస్తున్న నగదు (cash)ను పట్టపగలే ఓ దొంగ (thief) చోరీ (stole) చేసిన ఘటన నారాయణపేట జిల్లా (Narayanpet district)లో జరిగింది. చోరీ జరుగుతున్న సమయంలో సీసీ కెమెరా (CCTV footage)లో రికార్డ్ అయిన దృష్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కాలంలో దొంగతనాల తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో దొంగలు రాత్రిపూట మాత్రమే సంచరించి చేతి వాటం చూపించేవారు.. కానీ ఈ మధ్య కాలంలో పట్టపగలే రెచ్చిపోతున్నారు. చేతిలో నగదుతో వెళుతున్న ఉన్న వ్యక్తిని చూసుకొని, రెక్కి నిర్వహించి, అదును చూసుకొని మరీ దొంగతనాలు చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే నారాయణపేట (Narayanpet)లో జరిగింది. నారాయణ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉన్నదని చెప్పి బ్యాంకు (bank) నుంచి రూ. 4 లక్షల డ్రా (withdrawing) చేసి తీసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనం (two-wheeler)లో డబ్బు పెట్టి, మార్గమధ్యంలో బేకరీ (bakery)కి వెళ్లాడు. నారాయణ బ్యాంకులో డబ్బు తీయడం గమణించిన ఓ దొంగ ఇదంతా గమణిస్తూ.. ఫాలో అయ్యాడు. నారాయణ బేకరీకి వెళ్లడం గమనించి ఇదే అదునుగా భావించి నగదు ఉన్న బ్యాగ్ (Cash Bag) తీసుకొని ఉడాయించాడు. నారాయణ బేకరీ నుంచి బైక్ దగ్గరకి వెళ్లే సరికి డబ్బు ఉన్న సంచి కనిపించలేదు.. దీంతో వెంటనే పోలీసులను సంప్రదించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, బేకరీలో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సీసీ పుటేజీ ఆధారంగా కేసు నమోదు (case registered) చేసుకొని దర్యాప్తు (investigation) చేపట్టారు.






