కొండగట్టులో చోరీ : ఆలయాలే టార్గెట్! రంగంలోకి..

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-24 06:01:26  IST  )

జగిత్యాల జిల్లాలో ఆలయాలే టార్గెట్‌గా దోపిడీ దొంగల ముఠా చోరీలకు పాల్పడింది.

కొండగట్టులో చోరీ : ఆలయాలే టార్గెట్! రంగంలోకి..
X

దిశ, జగిత్యాల, మల్యాల: జగిత్యాల జిల్లాలో ఆలయాలే టార్గెట్‌గా దోపిడీ దొంగల ముఠా చోరీలకు పాల్పడింది. కొండగట్టు ప్రధాన ఆలయంతో పాటు జిల్లాలోని ధర్మపురి మండలం రాయపట్నం శివాలయంలో హుండీ పగలగొట్టి ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస గ్రామంలో గల పౌలహస్తీశ్వర స్వామి ఆలయ కార్యాలయంలోని బీరువాను పగలగొట్టారు. మరోవైపు దొంగలు ధర్మపురి మండలంలోని మరో ఆలయంలో కూడా దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది.

రంగంలోకి పది బృందాలు

కొండగట్టు చోరీ విషయంలో 10 బృందాలచే గాలింపు చర్యలు చేపట్టామని మల్యాల సీఐ రమణమూర్తి తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాల సేకరిస్తున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా దొంగల్ని పట్టుకుంటామని జగిత్యాల డీఎస్పీ ఆర్ ప్రకాష్ వెల్లడించారు.

Read More... కొండగట్టులో సిగ్నల్ ప్రాబ్లం.. జర్నలిస్టుల తిప్పలు

Next Story