- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తిని కొట్టి చంపిన మహిళ.. కారణమిదే!
తనపై అఘాత్యానికి ప్రయత్నించిన వ్యక్తిని కొట్టి చంపింది ఓ మహిళ.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : తనపై అఘాత్యానికి ప్రయత్నించిన వ్యక్తిని కొట్టి చంపింది ఓ మహిళ. అనంతరం భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. భార్యాభర్తలైన జయమ్మ, బాలయ్య బుద్వేల్‌లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పీకలదాకా తాగి తెల్లవారుఝాము 4గంటల సమయంలో జయమ్మ ఇంటి తలుపులు కొట్టాడు. ఆమె తలుపులు తెరవగానే లోపలికి తోసుకుంటూ చొరబడ్డ శ్రీనివాస్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దాంతో జయమ్మ ఇనుప రాడ్‌తో అతని తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత జయమ్మ భర్త బాలయ్యతో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.
Read More... HYD : సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సెల్ఫీ సూసైడ్ కలకలకం






