- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGRTC: బస్సు ఆపలేదని 10 కి.మీ చేజ్ చేసి డ్రైవర్ కండక్టర్ తో మహిళ వాగ్వాదం.. వీడియో వైరల్
బస్సు ఆపలేదని డ్రైవర్, కండక్టర్ తో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) అమలు తర్వాత ఆర్టీసీ (TG RTC) బస్సుల్లో గొడవల వ్యవహారం రోజుకో చోట వార్తల్లో నిలుస్తోంది. తాను బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఆపకుండా వెళ్లిపోయారని తాజాగా ఓ మహిళ 10 కిలోమీటర్లు చేజ్ చేసి బస్సు డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది. ఉప్పల్ (Uppal) ఎక్స్ రోడ్డు వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనపై సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తాను ప్రతి రోజు ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు ఎక్కుతానని ఎప్పటిలాగే ఇవాళ కూడా తనతో పాటు తన పిల్లతో కలిసి బస్సు ఎక్కేందుకు వచ్చానని ఓ మహిళ ఆరోపించింది. దిగేవాళ్లు దిగుతుండగానే కొందరు బస్సు ఎక్కారని, తాను కూడా బస్సు ఎక్కాను. తన పిల్లలు ఎక్కుతుండగా బస్సు వెళ్లిపోయిందని ఆరోపించారు. తన పిల్లలు ఎక్కలేదని చెప్పినా ఆపకుండా బస్సు కదిలిందని దాంతో నేను తన పిల్లల కోసం దిగే క్రమంలో బస్సు నుంచి కింద పడితే తననే తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై కండక్టర్ మాట్లాడుతూ బస్సు కదిరిన తర్వాత ఆమె కిందకు దిగే ప్రయత్నం చేసిందని అదృష్టం బాగుండటం వల్ల బస్సు చక్రాల కింద పడలేదని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.






