- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేటు జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం.. కొరడా ఝుళిపించిన ఇంటర్ బోర్డు
2025-26 విద్యా సంవత్సరంలో నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 495 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు ఏకంగా రూ.5.32 కోట్ల జరిమానా విధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: 2025-26 విద్యాసంవత్సరంలో నిబంధనలు ఉల్లంఘించిన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 495 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు ఏకంగా రూ.5.32కోట్ల ఫైన్ విధించింది. ప్రైవేట్ కాలేజీలు ప్రధానంగా అడ్మిషన్ల ప్రక్రియలో బోర్డు మార్గదర్శకాలను గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. షెడ్యూల్ కంటే ముందే అడ్మిషన్లు నిర్వహించడం, నిర్ణీత పరిమితికి మించి అదనపు సెక్షన్లను నిర్వహించడం, అనుమతి లేని భవనాల్లో తరగతులు నడపడం, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలను గుర్తించారు. చాలా కాలేజీలు కేవలం లాభార్జనే ధ్యేయంగా విద్యార్థుల భద్రతను, బోర్డు నిబంధనలను విస్మరిస్తున్నాయని విచారణలో తేలింది. నిబంధనలను అతిక్రమిస్తే గుర్తింపు రద్దుచేస్తామని గతంలోనే హెచ్చరించినప్పటికీ మార్పు రాకపోవడంతో ఈసారి భారీ జరిమానాలతో గట్టి సంకేతాలు పంపాలని బోర్డు నిర్ణయించింది. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల విద్యాసంవత్సరం దెబ్బతినకుండా జరిమానాతో సరిపెట్టినట్లు తెలుస్తున్నది. అయితే భవిష్యత్తులోనూ తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,374 జూనియర్ కళాశాలలకు అనుమతులు ఉన్నాయని, గుర్తింపు లేని కళాశాలలు ఏవీ నడవడం లేదని బోర్డు స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రూల్స్ ఉల్లంఘించిన కాలేజీలివే..
తుర్కయంజాల్ లో న్యూ చైతన్య జూనియర్ కాలేజీ పేరుతో సాగర్ హైవే రోడ్డు పక్కన బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయంపై అనుమతితో నడిపిస్తున్నారు. కానీ ఇదే పేరుతో న్యూ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు బ్రాంచీలను తుర్కయాంజాల్ లోని కమ్మగూడ, రాఘవేంద్రనగర్ లో నిర్వహిస్తున్నారు. బీఎన్ రెడ్డి సాగర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు సమీపంలో కృష్ణవేణి జూనియర్ కాలేజీ అనుమతితో నడిపిస్తున్నారు. ఇదే పేరుతో మరో కాలేజీ శ్రీపురం కాలనీలో అక్రమంగా నడిపిస్తున్నారు. హస్తినాపురం పద్మావతినగర్ కాలనీలో మహర్షి జూనియర్ కాలేజీ అనుమతితో నడిపిస్తున్నారు. ఇదే పేరుతో వనస్థలిపురంలోని ప్రశాంతి కాలనీలో అక్రమంగా కాలేజీ నడిపిస్తున్నారు. హస్తినాపురంలోని అక్షర జూనియర్ కాలేజీ, నవీన జూనియర్ కాలేజీ, మణికొండలోని వాల్యూఓక్ జూనియర్ కాలేజ్, నైన్ జూనియర్ కాలేజ్, మాదాపూర్ లోని అలెన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ పై సుమారు రూ.కోటి పదిలక్షల పెనాల్టీ విధించాల్సి ఉంది. రూల్ 14 ప్రకారం అనుమతులు లేని కాలేజీలపై రూ.10లక్షల చొప్పున పెనాల్టీ విధించాల్సి ఉంటుంది. రూల్ 14లోని అన్ని సెక్షన్లను కొన్ని కళాశాలలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నిబంధనల ఉల్లంఘన ఇలా..






