MLC elections: ఎన్నికలు బహిష్కరించిన గ్రామం.. ఎమ్మెల్సీ పోలింగ్ లో అనూహ్య పరిణామం

by Prasad Jukanti |   (  Updated:2025-02-27 07:08:13  IST  )

MLC elections: ఎన్నికలు బహిష్కరించిన గ్రామం.. ఎమ్మెల్సీ పోలింగ్ లో అనూహ్య పరిణామం
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ (Election of MLC) స్థానాల భర్తీ కోసం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది(Election of MLC) . ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వల్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలి వచ్చారు. ఉమ్మడి కరీంగనర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్- ఖమ్మం-నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టభద్రుల (Graduates) ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు బరిలో నిలవగా కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ (Teacher) బరిలో 15 మంది, వరంగల్- ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ బరిలో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడు స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయసంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ జరుగుతున్న విధానం తెలుసుకునేందుకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు,ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మార్చి 3న చేపట్టబోతున్నారు.

ఎన్నిక బహిష్కరించిన గ్రామం:

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను స్థానికులు బహిష్కరించారు. తమ మండలంలో రోడ్లు వేయలేదని ఓటింగ్ బహిష్కరించారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కు 244 మంది ఓటర్లు దూరంగా ఉన్నారు. మరో వైపు మంచిర్యాలలోని మందమర్రి పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ స్థానంలో కాంగ్రెస్‌ నేతలు టెంట్‌ వేసుకున్నారంటూ బీజేపీ నేతల ఆందోళనకు దిగారు. కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారము నిర్వహిస్తున్నారని ఏజెంట్ ఆందోళకు దిగారు. అభ్యర్థులను బయటికి పంపడంతో వివాదం సద్దుమణిగింది.

గ్రాడ్యుయేట్స్ 7.1%, టీచర్స్ 12.7%

ఇవాళ ఉదయం పది గంటల వరకు కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మొత్తం 15 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు కాగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి 7.1%, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 12.7% ఓట్లు దక్కాయి.

Next Story