కాసేపట్లో నగరానికి ఉప రాష్ట్రపతి రాక.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

by Kema Shiva Kumar |

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఇవాళ నగరానికి రాబోతున్నారు.

కాసేపట్లో నగరానికి ఉప రాష్ట్రపతి రాక.. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఇవాళ నగరానికి రాబోతున్నారు. ముందుగా ఆయన శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)కి వెళ్తారు. అక్కడ జరుగుతున్న జాతీయ స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్‌పర్సన్ల సమావేశం ముగింపు సెషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ తర్వాత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఆతిథ్యం మేరకు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. రేపు ఉదయం రంగారెడ్డి జిల్లాలో కన్హా శాంతి వనంలో హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ కార్యక్రమం అనంతరం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా న్యూ ఢిల్లీకి తిరిగి వెళ్తారు. అయితే వైస్ ప్రెసిడెంట్ రాక నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను పూర్తి చేసింది.

Next Story