ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరం: హరీష్ రావు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-10 05:14:40  IST  )

తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇంట్లో కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించే లోపు ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరం: హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Author Andesri) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇంట్లో కుప్పకూలగా.. ఆస్పత్రికి తరలించే లోపు ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషాద వార్తతో అందెశ్రీ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ ప్రజానియం షాక్‌కు గురైంది. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అందెశ్రీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్‌లో "ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి అకాల మరణం బాధాకరం. అందెశ్రీ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను." అని రాసుకొచ్చారు.

కేటీఆర్ సంతాపం

అందేశ్రీ మృతిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో "ప్రముఖ కవి, ప్రజా వాగ్గేయకారుడు, రచయిత, డా. అందె శ్రీ అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వారి పాటలు ప్రజల మదిలో ఎన్నటికీ నిలిచి ఉంటాయి. అందె శ్రీ గారికి ఉద్యమ జోహార్లు" అని రాసుకొచ్చాడు.

READ MORE .....

అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు.. మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

Next Story