కేంద్రమంత్రికి విశ్వాసం ఉంటే ఆ మాట చెప్పాలి.. బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్

by Ramesh Goud |   ( Updated:2025-03-23 17:21:17.0  )
కేంద్రమంత్రికి విశ్వాసం ఉంటే ఆ మాట చెప్పాలి.. బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రికి సక్కగా కనిపిస్తలేదా? లేక ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదా? అని బండి సంజయ్ ను ఉద్దేశించి తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పొన్నం.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో (MLA Kavvam Pally Sathyanarayana) కలిసి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకు స్థాపన, జువ్వాడి చొక్కారావు ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) పై ఫైర్ అయ్యారు.

ఇటీవల తమిళనాడులో (Tamilnadu) జరిగిన అఖిల పక్ష సమావేశానికి (All Party Meeting) దక్షిణ భారత దేశం నుంచే గాక, పంజాబ్ (Panjab), హర్యానా (Haryana), ఒరిస్సా (Odisha) తదితర రాష్ట్రాల నుంచి వచ్చారని, కేంద్రమంత్రికి దొంగల సభగా కనిపిస్తే అది దురదృష్టకరమని అన్నారు. మరి కేంద్రమంత్రికి సక్కగా కనిపిస్తలేదా..? లేక ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేక అలా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. కేంద్రం అమలు చేస్తామంటున్న డీలిమిటేషన్ (Delimitation) లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్రం అనేక సందర్భాల్లో తెచ్చిన జనాభా నియంత్రణ సంస్కరణలు అమలు చేయడం వల్ల జనాభా తక్కువ అయ్యిందని, పార్లమెంట్ లో సీట్లు తక్కువ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

పెరుగుతున్న సీట్ల సంఖ్య 1971 జనాభా లెక్కల ప్రకారం చేయాలని, లేకపోతే 25 ఏండ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలనే డిమాండ్లతో మీటింగ్ జరిగిందని తెలిపారు. డిమాండ్ల గురించి తెలిసి బండి సంజయ్ ఆ విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి, తెలంగాణకు అన్యాయం జరగదని ఆయనకు విశ్వాసం ఉంటే, యూపీలో 80 నుంచి 120 సీట్లు పెరిగినట్లే.. తెలంగాణలో కూడా 16 నుంచి 25 సీట్లు అవుతాయా? కాదా? బండి సంజయ్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed