- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సై కుటుంబానికి బ్యాచ్మేట్ల అండ.. రూ.25 లక్షల ఆర్థిక సాయం
by Javid Pasha |
గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్‌కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గుండెపోటుతో మరణించిన 2014వ సంవత్సరం బ్యాచ్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఆయన బ్యాచ్‌కు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ఇన్స్పెక్టర్లు అండగా నిలిచారు. 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతా కలిసి 25 లక్షల రూపాయలను సేకరించి ప్రభాకర్ కుటుంబానికి అందించారు. ఇందులో ఇరవై లక్షల రూపాయలను ప్రభాకర్ మూడేళ్ల కూతురు అక్షయరెడ్డి పేర మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.
మిగతా అయిదు లక్షల రూపాయలను ప్రభాకర్‌రెడ్డి తల్లిదండ్రులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి భార్య లక్ష్మీ ప్రసన్న, తల్లిదండ్రులు, ఎల్బీనగర్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న అన్న దయాకర్‌రెడ్డి, 2014వ సంవత్సరం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు టాటా శ్రీధర్, రామకృష్ణ, శ్రీనివాసులతోపాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
Next Story






