- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగణన గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
జనాభా గణనపై తెలంగాణప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జనాభా గణనపై తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు ప్రచురించారు. భారతదేశంలో తదుపరి జనాభా గణన (సెన్సస్) 2027 సంవత్సరంలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ విడుదల చేసిన గెజిట్ కు కొనసాగింపు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది.
వచ్చే సంవత్సరం హౌస్ హోల్డ్ సర్వే, 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా గణన చేయనున్నారు. ఈ సారి జనాభా గణనతో పాటుగా కులగణన కూడా చేయనున్నారు. జనాభా గణనను పూర్తి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గెజిట్ కీలకం కానుంది. 2027 మార్చి 1 నాటికి జనాభా గణన పూర్తి కానుంది.
- Tags
- census






