- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sarpanch Elections: ఆ జిల్లాల్లో తక్కువ పోలింగ్.. అధికారులను అలర్ట్ చేసిన ఎస్ఈసీ

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలక పోలింగ్ (Telangana Panchayat Elections) జరుగుతోంది. 3,752 సర్పంచ్, 28410 వార్డు సభ్యుల పదవులకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 23.52 శాతం పోలింగ్ నమోదు అయింది. మరోవైపు జరుగుతున్న పోలింగ్ సరళిని మాసబ్ ట్యాంక్ ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల అధికారిణి రాణి కుముదిని (Rani Kumudini) పర్యవేక్షించారు. డ్యాష్ బోర్డు ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఎన్నికల పరిశీలకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఫోన్ చేసి గ్రౌండ్ లో పరిస్థితిపై ఆరా తీశారు. నిర్మల్ లో తక్కువ ఓటింగ్ నమోదవుతుండటంపై రాణి కుముదిని అక్కడి అధికారులతో మాట్లాడారు.
Next Story






