- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
రాష్ట్రంలో తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 ప్రకారం సాదాబైనామాల క్రమబద్ధీకరించనున్నట్లు బుధవారం సీసీఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో తెలంగాణ భూ భారతి(రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్ 2025 ప్రకారం సాదాబైనామాల క్రమబద్ధీకరించనున్నట్లు బుధవారం సీసీఎల్ఏ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 11 వరకు దాఖలైన అప్లికేషన్ల వరకే రెగ్యులరైజ్ చేస్తారు. ఆర్వోఆర్ 2020లో వీటిని పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో హైకోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఇటీవల భూ భారతిలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తించింది. దాంతో పెండింగులో ఉన్న 9 లక్షలకు పైగా అప్లికేషన్లను పరిశీలించి, రెగ్యులరైజ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీసీఎల్ఏ జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూ భారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేయనున్నారు. రైతులు సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యుటేషన్ కి అవకాశం లభించింది. 2014 జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాటికి అవకాశం లేదని జీవోలో స్పష్టం చేశారు. తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్స్ యాక్ట్, 1971 ప్రకారం 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు సమర్పించిన దరఖాస్తుల వరకే ఈ జీఓ పరిమితం కానున్నది. భూ భారతి చట్టం 2025 లో సెక్షన్ 6(1) ప్రకారం ఆర్డీవో స్థాయి అధికారికి క్రమబద్దీకరణ అధికారాలను కట్టబెట్టారు.






