దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం.. GHMC వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల కోసమే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేసింది.

దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం.. GHMC వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల కోసమే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేసింది. మంగళవారం నిర్వహించిన జీహెచ్ఎంసీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్‌లో కమిషనర్ కర్ణన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలు డిసెంబర్ 31లోగా ఇవ్వాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఎన్ని వార్డులు ఉన్నాయి, జనాభా ఎంత ఉంది, వార్డులు ఎన్ని ఉన్నాయన్న వివరాలు కోరింది. ఇందుకు గాను ఈ నెల 31 వరకు డెడ్‌లైన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను జీహెచ్ఎంసీ అధికారులు చట్ట ప్రకారం వేగవంతం చేశారు. ఇప్పటికే వారం రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించిన జీహెచ్ఎంసీ కోర్టు ఆదేశాలతో మరో రెండు రోజులపాటు స్వీకరించాలని నిర్ణయించింది.

వారంలో ఫైనల్ నోటిఫికేషన్

జీహెచ్ఎంసీలో 27 యూఎల్బీల విలీనం, 300 వార్డుల పునర్విభజనకు సం బంధించిన ముసాయిదా నోటిఫికేషన్ జా రీచేయడం, అభ్యంతరాల స్వీకరణ.. వాటి పరిశీలన, పరిష్కారం అనంతరం ప్రభుత్వా నికి రిపోర్టు పంపించనున్నారు. జీహెచ్ ఎంసీ రిపోర్టును పరిశీలించి ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ జారీచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5,905 అభ్యంతరాలు వచ్చా యి. సర్కిల్, జోనల్, హెడ్ ఆఫీసు స్థాయి లో వచ్చిన అభ్యంతరాలను వేర్వేరుగానే రికార్డు చేస్తున్నారు. దీంతోపాటు అంశాలవారీగా ఫైల్ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదివరకు వచ్చిన వాటిలో ఎక్కువగా వార్డుల పేర్లు మారాయని, వార్డు పేరుతో ఉన్న ప్రాంతాలు ఆ డివిజన్‌లో కాకుండా పక్క డివిజన్‌లోకి వచ్చాయని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో పాటు వార్డుల బౌండరీలు సరిగ్గాలేవని, బౌండరీల హద్దులు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదని వచ్చాయి. ఇక ఇదివరకు ఉన్న వార్డులను రెండు, మూడు, నాలుగు ముక్కలుగా విభజించారని అభ్యంతరాలు వచ్చాయి.

పేర్ల మార్పుపైనే అభ్యంతరాలు అధికం

వార్డుల పునర్విభజనకు సంబంధించి బుధవారం వరకు 5,905 అభ్యంతరాలు వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండడంతో ఏడువేలకు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వచ్చిన అభ్యంతరాల్లో ఎక్కువగా పేర్ల మార్పుపై వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ పేర్ల మార్పుపై అధికారులు కసరత్తు చేపట్టారు. జనరల్ బాడీ మీటింగ్‌లో వచ్చిన సలహాలు, సూచనలపై టౌన్ ప్లానింగ్, ఎన్నికల విభాగం అధికారులు బుధవారం కసరత్తు ప్రారంభించినట్టు చెబుతున్నారు.

ఎన్నికలకు మరో ఏడాది?

గ్రేటర్ ఎన్నికలు నిర్వహించేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైన తరువాత కార్పొరేషన్‌ను రెండుగా చేయాలా? మూడు చేయాలా? అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. కార్పొరేషన్ల బౌండరీలు ఫిక్స్ చేసి అధికారులు, సిబ్బందిని కేటాయించనున్నారు. ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వార్డులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల సమయంలోనూ మార్పులు చేసే అవకాశముంది. జనాభా, సరిహద్దులు, రిజర్వేషన్లు మార్చే అవకాశాలు ఉన్నాయి.

Next Story