- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐక్యతా స్ఫూర్తి కొనసాగించాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
by Muthe.Rajitha |
తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐక్యతా స్ఫూర్తితో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐక్యతా స్ఫూర్తితో వర్ధిల్లాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో నిర్వహించిన హోళీ వేడుకలో గవర్నర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రజలందరికి హోలీ పండుగ శుబాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్ భవన్ సిబ్బంది, సిబ్బంది పిల్లలు, అధికారులతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హోలీ ఆడారు. చిన్నారులకు రంగులను పూశారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకోవాలని కోరారు. సహజసిద్ధమైన రంగులతోనే హోలీ నిర్వహించుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
Next Story






