- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరి సంతకాలే రాష్ట్రానికి మరణశాసనం.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
నీటి హక్కుల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. కానీ, గత పదేళ్లుగా నీటి విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నీటి హక్కుల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. కానీ, గత పదేళ్లుగా నీటి విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఆయన హాజరయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో సంకుచిత స్వభావంతో తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఇక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
రాజకీయ లబ్ధి పొందాలనుకోవట్లేదు..
తెలంగాణ ఉద్యమానికి నీళ్లే ప్రధాన కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో తాము వ్యూహాత్మకంగా వెళ్తున్నామని.. రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదన్నారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయని.. అందులో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పందం కుదరిందన్నారు. నాడు 299 టీఎంసీలు చాలని బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఏపీకి 66 శాతం నీళ్లు శాశ్వత హక్కు ఇచ్చేలా కేసీఆర్ సంతకం పెట్టారని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలే తెలంగాణకు మరణశాసనం అయ్యాయని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి కోసం ఏపీపై ఒత్తిడి తెస్తున్నామని.. మనం బలంగా వాదిస్తున్నామనే చంద్రబాబుకు జగన్ లేఖ కూడా రాశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తల వదిలేసి తోక దగ్గర నీళ్లు తెచ్చేలా ప్రాజెక్టు డిజైన్..
ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా.. మనం మన వాటా కూడా వాడుకోలేని పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కమిషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని తెలిపారు. శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ఏపీ నీటిని తరలిస్తోందని ఆరోపించారు. తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తూ ఆశ్చర్యం వేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.






