- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్త్రీ మూర్తి సేవలు వెలకట్టలేనివి : ఈస్కీ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు
‘మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ’ .. అంటూ స్త్రీ మూర్తి ఔన్నత్యాన్ని చాటాడు ఒక మహాకవి.

దిశ, తెలంగాణ బ్యూరో : ‘మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ.. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ’ .. అంటూ స్త్రీ మూర్తి ఔన్నత్యాన్ని చాటాడు ఒక మహాకవి. అమ్మ రూపంలో ప్రేమ, లాలన, భార్య రూపంలో ఆప్యాయత, అమ్మమ్మల రూపంలో కుటుంబ పెద్దగా అనుబంధాలకు పెద్ద పీటవేస్తూ మనుషుల జీవన విధానంలో అనేక రకాల పాత్రలు పోషించే మహిళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా(ఈస్కీ) డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈస్కీలో శుక్రవారం జరిగిన మహిళా వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన స్త్రీ మూర్తి లేకుంటే ప్రపంచమే లేదన్నారు. త్యాగం, సహనం, ధీరత్వం, వినయం, వివేకం, విజ్ఞత, నేర్పరితనం, నిర్ణయాధికారం, మేధోబలo అన్నీ కూడా స్త్రీ మూర్తికున్న గొప్ప వరాలన్నారు.
ఒక మహిళ తన జీవిత కాలంలో తల్లిగా, చెల్లిగా,అక్కగా, కూతురుగా, భార్యగా, స్నేహితురాలిగా, సామాజిక కార్యకర్తగా, నర్సుగా వివిధ రకాల సేవలను అందిస్తుంది. వారు అందించే ఈ త్యాగాలకు, సేవలకు ఏ రూపంలో కూడా తిరిగి చెల్లించలేమని, అందుకే ప్రతి పురుషుడు స్త్రీ మూర్తిని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. 2025 అంతర్జాతీయ మహిళా సంవత్సరం థీమ్ యాక్సలరేట్ యాక్షన్ ..అంటే, విద్య, ఉపాధి, మరియు నాయకత్వం వంటి రంగాల్లో మహిళలు మరింత వేగవంతంగా పనిచేయడానికి కావాల్సిన వ్యూహాలను సాధనాలను గుర్తించి వారిని అభివృద్ధి పథం వైపు పయనించే విధంగా ప్రోత్సహించడం అవసరమని డాక్టర్ రామేశ్వర్ రావు అన్నారు. ఈ సందర్భగా పాలసీ బజార్ సౌజన్యంతో బంజారాహిల్స్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్ సహకారంతో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ లో కాలేజ్ లో పనిచేస్తున్న పలువురు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. మహిళా సిబ్బందితో పాటుగా ఇతర సిబ్బంది కూడా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ క్యాంప్ లో మెడికల్ సిబ్బంది డాక్టర్ సుష్మతో పాటుగా మౌనిక, పూజ, మేనేజర్ గోపి, రవి, సునీల్ కుమార్, పాలసీ బజార్ నుండి తేజేశ్వర్ శాస్త్రి, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మహిళలకు జరిగిన ఆట పాటల పోటీల్లో పలువురు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మ్యూజికల్ చైర్స్, షటిల్స్ లో పలువురు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు పర్యావరణ విభాగం హెడ్ గా పనిచేస్తున్న అనితా అగర్వాల్ తో పాటుగా కాలేజ్ చీఫ్ ఎస్. లక్ష్మికాంత రావు, శ్రీధర్ బాబు, డాక్టర్ చంద్రకళ, డాక్టర్ ఎం. సింధు, డాక్టర్ పి. రాజారావు, వై. పద్మావతి పర్యవేక్షణలో జరిగాయి. పోటీల్లో శ్వేత, సునీత, సౌమ్య, జ్యోతి, సరస్వతి,కవిత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.






