వరుస బస్సు ప్రమాదాలు నన్ను కలవర పరుస్తున్నాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్

by Malleboina Mahesh |

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఐదు బస్సు ప్రమాదాలు చోటు చేసుకోగా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

వరుస బస్సు ప్రమాదాలు నన్ను కలవర పరుస్తున్నాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో ఐదు బస్సు ప్రమాదాలు (Five bus accidents) చోటు చేసుకోగా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస ప్రమాదాలపై ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వరుస బస్సు ప్రమాదాలు తనను కలవరపరుస్తున్నాయని బండి ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో "ఈరోజు తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి వద్ద జరిగిన బస్సు-ట్రాక్టర్ ప్రమాదం బాధాకరం.

విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పత్తితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో, పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని.. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని అధికారులకు సూచించడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. మెట్పల్లి డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది గాయపడ్డారు. వారందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి." అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాసుకొచ్చారు.

Next Story