- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి.. అన్ని పార్టీలకు MLC అద్దంకి కీలక పిలుపు
ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందే. ఇప్పటికే ఎన్డీఏ నుంచి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణ, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో అటు బీజేపీ.. అటు కాంగ్రెస్ తమ అభ్యర్థులను మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలుగు రాష్ట్రాల్లోన్ని అన్ని రాజకీయ పార్టీలకు కీలక పిలపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ బిడ్డ కావడం మరింత గర్వకారణంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలన్నీ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. గతంలో పీవీ నరసింహా రావు రాష్ట్రం నుంచి పోటీ చేస్తే ఎన్డీఆర్ ఆయనకు పోటీగా అభ్యర్థిని పెట్టక తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారో.. నేడు చంద్రబాబు కూడా అదే విధంగా వ్యవహరించాలని తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్‌తో పాటు కేసీఆర్, జగన్‌లు కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పిలపునిచ్చారు.






