- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Global summit: గ్లోబల్ సమ్మిట్‍లో కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం.. సెకండ్ డే రూ.1,04,350 కోట్ల ఎంవోయులు
తెలంగాణ రైజింగ్‍లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‍లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రెండో రోజు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుసగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. రెండో రోజు ఇప్పటి వరకు ఆయా సంస్థలు రూ.1,04,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
విస్తరణకు గోద్రెజ్ ముందుకు..
తెలంగాణ ప్రభుత్వంతో ఇవాళ గోద్రెజ్ జెర్సీ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ సమ్మిట్ లో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గోద్రెజ్ జర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ పిరోజ్‌షా గోద్రెజ్, గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మిల్క్, ఎఫ్‌ఎమ్‌సీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ విభాగాల్లో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి చూపింది. రాష్ట్రంలో తమ డెయిరీ వ్యాపారాన్ని (రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం) 150 కోట్ల పెట్టుబడితో విస్తరించే ప్రతిపాదనపై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 40 ఎకరాల భూమి అవసరం కానుండగా 2 సంవత్సరాలలో 300 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు సంస్థ తెలిపింది. ఫర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అత్యాధునిక ఫుడ్ అండ్ అగ్రికల్చర్ R&D సెంటర్ మరియు రేర్ షుగర్స్ తయారీ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఫేజ్–1 కింద రూ.500 కోట్లు, ఫేజ్–2 కింద రూ.1,500 కోట్ల ఇన్వెస్ట్ కు ఒప్పందం చేసుకుంది. ఇందుకు 100 ఎకరాల భూమి ఆవశ్యకత ఉండనుండగా రాబోయే రెండేళ్లలో 800కి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
ఇక కేజేఎస్ ఇండియా ఫుడ్ & బేవరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్–2 విస్తరణ కోసం రూ. 650 కోట్ల ఇన్వెస్ట్ కు ముందుకు రాగా 1,551 ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. 1000 ప్రత్యేక్ష ఉద్యోగాలు కల్పించేలా వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ రూ.1,100 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (RPCL) మల్టీ–ప్రొడక్ట్ FMCG మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ.1,500 కోట్లతో 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, కైన్‌స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ విస్తరణ కోసం రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయబోతున్నామని అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జేసీకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డేటా సెంటర్ అండ్ అనుబంధ మౌలిక సదుపాయాలు కోసం 2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేలా రూ.9,000 కోట్లు, ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు దశల్లో రూ.2,500 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ ద్వారా 1,600+ ప్రత్యక్ష ఉద్యోగాలు అవకాశాలు దక్కేలా ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. అక్విలోన్ నెక్సస్ లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ఆధారిత 50 మెగావాట్ల డేటా సెంటర్, ఏజీపీ గ్రూప్ 1GW హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) ఏర్పాటు కోసం పెట్టుబడి: రూ.6,750 కోట్లు, ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్ AI రెడీ 1GW డేటా పార్క్ అభివృద్ధి కోసం రూ.70,000 కోట్లు, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ & AI ఆధారిత హైపర్ స్కేల్ డేటా సెంటర్ జీసీసీ ద్వారా 3,000 ఉపాధి అవకాశాలు కల్పించేలా అవగాహన ఒప్పందం కుదిరింది.
హెటెరో గ్రూప్ భారీ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ యూనిట్ల కోసం రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టి 9,000కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకుంది. ఇక భారత్ బయోటెక్ అత్యాధునిక CRDMO సౌకర్యం ఏర్పాటు కోసం రూ.1,000 కోట్లు, అరోబిందో ఫార్మా కాంప్లెక్స్ జనెరిక్స్, ఇంజెక్టబుల్స్, బయోసిమిలార్స్ విస్తరణ కోసం రూ.2,000 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా పెప్టైడ్స్ తయారీ అండ్ ఆంకాలజీ CDMO యూనిట్లు కోసం రూ.1,200 కోట్లు, బయోలాజికల్ ఈ లిమిటెడ్ వ్యాక్సిన్, R&D మరియు CDMO విస్తరణ కోసం రూ.4,000 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి.






