కమ్యూనిస్టుల త్యాగమే భూవిప్లవ విజయ రహస్యం..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-15 12:22:27  IST  )

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని, వారి త్యాగమే భూవిప్లవ విజయ రహస్యం అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు.

కమ్యూనిస్టుల త్యాగమే భూవిప్లవ విజయ రహస్యం..
X

కమ్యూనిస్టుల త్యాగమే భూవిప్లవ విజయ రహస్యం..

- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వారసులు కమ్యూనిస్టులే

- సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు

- దుమ్ముగూడెం ములకపాడు కేంద్రంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభ

దిశ, దుమ్ముగూడెం: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని, వారి త్యాగమే భూవిప్లవ విజయ రహస్యం అని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం దుమ్ముగూడెం మండలం ములకపాడు సెంటర్‌లోని యలమంచి సీతారామయ్య భవనంలో జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభకు సిపిఎం నాయకుడు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నిజాం పాలనలో రజాకార్ దోపిడీలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పుచ్చలపల్లి సుందరయ్య వంటి అమరవీరులు చూపిన స్ఫూర్తి భవిష్యత్ ఉద్యమాలకు మార్గదర్శకమని తెలిపారు. ఈ పోరాట ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడం కమ్యూనిస్టుల చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించే బిజెపి–ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలను అడ్డుకోవాలని, దుమ్ముగూడెం మండలంలో ఎర్రజెండా రెపరెపలాడేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభలో సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు, మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య, కొర్సా చిలకమ్మ, మండల నాయకులు సరియం కోటేశ్వరరావు, యలమంచి శ్రీనుబాబు, బొల్లి సత్యనారాయణ, మహమ్మద్ బేగ్, సోయం వీర్రాజు, మడకం మహేంద్రనాథ్, పూనెం శోభరాణి తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచులు తోడం తిరుపతిరావు, సోయం పార్వతి, కల్లూరి దేవి, అపక రంగయ్య, కోడి వీరస్వామి, కొమరం వీర్రాజు, శీలం రమేష్ తదితరులు కూడా హాజరయ్యారు.

Next Story