తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 02:31:38  IST  )

ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిపోయారు.

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిపోయారు. ఓ వైపు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ కొనగుతూనే ఉంది. ఇక శుక్రవారం స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 2 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 63,539 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.

Next Story