- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యాంక్ బండ్ పై అర్దరాత్రి తరవాత కొనసాగిన భక్తుల రద్దీ
by Ajay Maddhiboyina |
ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి దాటిన తరవాత సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాత్రి 12గంటలకు ట్యాంక్ బండ్ పై ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు.

X
దిశ, వెబ్ డెస్క్: ట్యాంక్ బండ్ పై అర్ధరాత్రి దాటిన తరవాత సైతం భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాత్రి 12గంటలకు ట్యాంక్ బండ్ పై ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. తమ వెంట తీసుకువచ్చిన గణనాథుళ్లను నిమజ్జనం చేశారు. ఊరేగింపుగా వస్తూ ఒక్కో వినాయకున్ని క్యూ పద్దతిలో నిమజ్జనం చేశారు. చిన్న వినాయకుడి విగ్రహాలు ఒకవైపు, పెద్ద విగ్రహాలను ఒకవైపు నిమజ్జనం చేశారు. భక్తులు భారీగా తరలిరావడంతో ట్యాంక్ బండ్ పై ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు. రాత్రి 12 గంటల తరవాత సైతం భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది. ఒకదాని వెంట ఒకటి వాహనాలు వస్తూనే ఉన్నాయి. భక్తులు అధికంగా ఉండటంతో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీశిలిస్తూనే ఉన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story






