- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సస్పెండ్ వార్త వినగానే కుప్పకూలిన ప్రిన్సిపాల్.. చివరికి ఏమైందంటే..?
ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. దీంతో ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు.

దిశ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. దీంతో ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడానికి ప్రధానోపాధ్యాయుడే కారణమని జిల్లా అదనపు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్త వినగానే పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్యం మండల విద్యాధికార్యాలయంలో ఒక్కసారి కుప్పకూలి పడిపోయాడు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు కుప్పకూలిన ప్రధానోపాధ్యాయుడు మాణిక్యంను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా పిఆర్టియు అధ్యక్షులు కుషాల్ ఎల్లారెడ్డి కి చేరుకొని, సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయుడు మాణిక్యంను ఆసుపత్రిలో, పరామర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ..ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అప్పగించడం పట్ల భావోద్వేగానికి లోనవుతున్నారని, ఏదైనా స్వచ్ఛంద సంస్థకు మధ్యాహ్న భోజనంను అప్పగించినట్లయితే ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువు ఉపాధ్యాయులు పిఆర్టియు ఎల్లారెడ్డి అధ్యక్షులు శ్రీనివాస్ మండల, విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.






