- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranti Effect: ఆకాశాన్నంటిన విమాన టికెట్ల ధరలు
సంక్రాంతి పండగకు ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండగకు ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మూడు, నాలుగు నెలల క్రితమే ట్రైన్‌కు రిజర్వేషన్ చేసినా వెయిటింగ్ లిస్టులు చాంతాడంత ఉన్నాయి. ప్రత్యేక బస్సులు, రైళ్లు వేసినా నిమిషాల వ్యవధిలోనే నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. దీంతో విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు నుంచి విశాఖ వచ్చే వారికి విమాన టికెట్ ధరలు షాక్ కొట్టిస్తున్నాయి. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కనీస ఛార్జీ రూ.17,500కి పైమాటే. బెంగళూరు నుంచి విశాఖ రావాలంటే కనీసం రూ.12 వేలు పెట్టాల్సిందే. సాధారణ రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి కనీస ధర రూ.3,400 నుంచి రూ.4 వేలు ఉండగా.. ప్రస్తుతం మూడు నాలుగు రెట్లు పెరిగిపోయింది. అయినప్పటికీ, సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాసతో వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రయాణాలు సాగిస్తున్నారు.






