- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sudarshan Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. పెరిగిన పోలింగ్ తో పార్టీలకు కొత్త టెన్షన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగినట్లు ఈసీఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి (Telangana MLC Elections) పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని సీఈవో సుదర్శన్ రెడ్డి (CEO Sudarshan Reddy) తెలిపారు.. బ్యాలెట్ బాక్సులను కరీంనగర్, నల్గొండలో భద్రపరుస్తామని మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆరు ఫిర్యాదులు వచ్చాయని, డబ్బుల పంపిణీ జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.
పెరిగిన ఓటింగ్ శాతంతో ఎర్త్ ఎవరికో?:
మూడు నియోజకవర్గాల్లో గతంలో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిందని సీఈవో వెల్లడించారు. ఏయే స్థానంలో ఎంతెంత శాతం పెరిగిందనేది పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. అయితే పెరిగిన పోలిగ్ పర్సంటేజ్ ఏ అభ్యర్థికి కలిసి రాబోతున్నదని మరె అభ్యర్థికి ఫిట్టింగ్ పెట్టబోతున్నది అనేది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. దీంతో గులాబీ పార్టీ సానుభూతి పరులు ఎవరికి మద్దతు తెలిపారు, సైలెంట్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనేది ఇప్పటికే సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో పెరిగిన పోల్ శాతం (Polling Percentage) ఎవరి విజయానికి బాటలు వేయబోతున్నది మరెవరికి ఎర్త్ పెట్టబోతున్నదనేది తెలియాలంటే మార్చి 3 వరకు ఎదురు చూడాల్సిందే.






