జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారు.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా, బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన కామెంట్లపై కాంగ్రెస్​ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం దయాకర్​మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటున్నారని, తెలంగాణను బుల్డోజర్లతో విధ్వంసం చేసిన కారు వద్దని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగ గెలిపించారో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు అలా తమ పార్టీని గెలిపిస్తారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోనూ.. అసలు ఉనికిలోనే లేదన్నారు. వాళ్లు ఇంకా గెలుస్తామన్న భ్రమల్లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. మీరు, మీ బామ్మర్ది సెంటిమెంట్‌తో ఎంత చేసినా ఉపయోగం లేదని అద్దంకి దయాకర్ తీవ్రంగా విమర్శించారు.

Next Story