ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు గట్టి బుద్ధి చెప్పారు : ఎర్రబెల్లి దయాకర్ రావు

by Muthe.Rajitha |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి.

ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు గట్టి బుద్ధి చెప్పారు : ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ ఇప్పటికే 29 సీట్లు గెలిచి మరో 19 స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతుండగా.. ఆప్ 13 సీట్లు గెలిచి, మరో 9 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాగా కాంగ్రెస్ ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. అయితే ఢిల్లీ ఫలితాలపై బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ను ఎద్దేవా చేస్తూ వరుస ట్వీట్లు కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్)‌లో సెటైరికల్ ట్విట్ చేశారు. ‘బీజేపీ (BJP)ని గెలిపించినందుకు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కంగ్రాట్స్’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్వీట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

మరో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు గుండు సున్నా ఇచ్చారని అన్నారు. త్వరలోనే దేశంలో కాంగ్రెస్ దుకాణం మూత పడుతుంది అని, కాంగ్రెస్ పని ఖతం అన్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది దేశం అంతా చూసిందని.. అందుకే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఛీకొట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని నమ్మడం లేదన్నారు. తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అబద్దాలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండానే అన్నీ అందించామని ఛాన్స్ దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకుంటున్నారని.. వాస్తవానికి ఒక్క గ్రామంలో కూడా పూర్తిగా అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబడ్డలు అని.. అబద్దాలు చెప్పడం తప్ప కాంగ్రెస్ పాలనలో మరొకటి ఉండదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Next Story