- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పడకేసిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు !
సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు ఆదిలోనే హంసపాదుగా మారింది. డీపీఆర్ తయారు చేసే

మొండికేసిన మెయిన్ హార్ట్ ఏజెన్సీ
ఆరునెలలైనా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వని వైనం
బిల్లులివ్వలేదని సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు సమాచారం
పడకేసిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు
పట్టించుకోని అధికారులు
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులు ఆదిలోనే హంసపాదుగా మారింది. డీపీఆర్ తయారు చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. డీపీఆర్ తయారుచేసిన నియమించిన కాంట్రాక్టు ఎజెన్సీ మొండికేసింది. పనులు చేయకుండానే బిల్లులివ్వడంలేదని ఇంజినీరింగ్ అధికారులను దబాయించినట్టు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీన ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేయడానికి మెయిన్ హర్ట్ ఏజెన్సీతో మూసీ రివర్ ఫ్రంట్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) 4 డిసెంబర్ 2024న ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. డీపీఆర్ తయారు చేయడానికి 18నెలలపాటు సమయం పడుతుందని ఒప్పందంలో రాసుకున్నారు. అయితే నెలరోజుల్లోనే ప్రాథమిక రిపోర్టు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఆరునెలలు గడిచినా ఇంతవరకు ఏలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడంతోపాటు బిల్లులివ్వడంలేదని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పలేక, మెయిన్ హార్ట్ ఎజెన్సీతో సకాలంలో పనులు చేయించలేక అధికారులు సతమతమవుతున్న చర్చ జరుగుతున్నది. అయితే 55కిలోమీటర్ల మూసీ, పరివాహన ప్రాంతంతోపాటు, నదిలోకి వరద ప్రవాహం వచ్చే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావితం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో ఐదు రకాల మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఆధారంగానే డీపీఆర్ తయారుచేయడంలో ఏజెన్సీ విఫలమైనట్టు అధికారులు చెబుతున్నారు.
పడకేసిన..డీపీఆర్ పనులు…..
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, భూమి ఉపయోగ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ల ఆధారంగా ప్రాజెక్టు తుది డీపీఆర్ తయారుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీపీఆర్ తయారుచేయడానికి ప్రభుత్వం 18నెలలపాటు సమయం కేటాయించింది. అయితే మెయిన్ హార్ట్ ఎజెన్సీ ఆధ్వర్వంలో సర్వే పనులు ఆశించిన స్థాయిలో జరగడంలేదని అధికారవర్గాల వాదన. ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వడానికి ఆరునెలలు తీసుకున్న ఎజెన్సీ డీపీఆర్ తయారుచేయడానికి ఎంత సమయం తీసుకుంటుందోనని విమర్శలూలేకపోలేదు. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన ఎజెన్సీ తీరుపై అధికారులు మండిపడుతున్నారు.
ఎవరిని అడగాలి?.....
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీన ప్రాజెక్టుకు డీపీఆర్ తయారుచేయడానికి కాంట్రాక్టు దక్కించుకున్న మెయిన్ హార్ట్ ఎజెన్సీకి సంబంధించిన ఆఫీసుతోపాటు సంబంధిత వ్యక్తిలేకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు గచ్చిబౌలిలో ఆఫీసు ఏర్పాటు చేసినా అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేయించినట్టు తెలిసింది. దీంతోపాటు ఎజెన్సీకి సంబంధించిన వ్యక్తి అమెరికా నుంచి అప్పుడప్పుడు వచ్చిపోతున్నట్టు సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేస్తున్న ఎజెన్సీకి సంబంధించిన ప్రత్యేకంగా ఓ వ్యక్తిని నియమించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
పట్టించుకోని అధికారులు..
మూసీ పునరుజ్జీన ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు పనులు లంగర్ హౌస్ ఏరియాలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయిస్తే చాదర్ ఘట్, మలక్ పేట్ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లను ఖాళీ చేయించి విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వంలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు మారారు. ప్రస్తుతం మూడో వ్యక్తిని నియమించింది. దీంతోపాటు ఇతర అధికారులున్న ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని ప్రచారం జరుగుతున్నది. అధికారుల తీరు, కాంట్రాక్టు ఎజెన్సీ నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.






