కేటీఆర్​ను భర్తరఫ్​చేయాలి.. ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాలు పిలుపు

by Disha Web Desk 14 |
కేటీఆర్​ను భర్తరఫ్​చేయాలి.. ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాలు పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్​పీఎస్సీ పేపర్ ​లీకేజ్​ అంశంలో మంత్రి కేటీఆర్​ను వెంటనే భర్తరఫ్ ​చేయాలని ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాల నేతలు కోరారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిన ప్రభుత్వాన్నీ రద్దుచేయాలని గవర్నర్​ కు కోరారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్​ పీఏ తిరుపతిని అరెస్టు చేయాలని డిమాడ్ చేశారు.. ఓయూ ఆర్ట్స్ ​కాలేజీ ముందు ఓయూ ఐక్య విద్యార్ధి సంఘాలు మంగళవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారంలో 9 మంది సామాన్యమైన నిందితులను అరెస్ట్ చేసి కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టుందన్నారు. లీకేజీతో సంబంధం ఉన్న మంత్రి వర్గంలోని కేసీఆర్ ​కుటుంబీకులను అరెస్టు చేయాలన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.

కమిషన్​ చైర్మన్​, సెక్రటరీలను పదవుల నుంచి తొలగించాలన్నారు. నష్టపోయిన నిరుద్యోగ అభ్యర్ధులకు రూ. లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఇక నిరుద్యోగుల కోసం ఓయూ కి వచ్చే రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని చూస్తే బీఆర్​ఎస్​ విద్యార్థి విభాగం నేతలుకు చెప్పు దెబ్బలు తప్పవన్నారు. మంత్రి కేటీఆర్​ ఏ తప్పూ చేయకపోతే ఆర్ట్స్​కాలేజీకి వచ్చి క్షేమంగా తిరిగి వెళ్లాలని ఐక్య విద్యార్ధి సంఘాలు కోరాయి. ఈ నెల 24, 25 తేదీల్లో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ మహా నిరసన దీక్షను జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఐక్య విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు కోటూరి మానవతారాయ్, కోట శ్రీనివాస్ గౌడ్, దుర్గం భాస్కర్, బాల లక్ష్మీ, కేతూరి వెంకటేష్, కొప్పుల ప్రతాపరెడ్డి, శరత్ నాయక్, ఈశ్వర్ లాల్, సుబ్బు నాయక్, భిక్షపతి నాయక్, నిరంజన్ యాదవ్, మిడతనపల్లి విజయ్, బొనగాల నరేష్, మదన్, రమేష్ రాథోడ్, భీమ్ రావ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed