- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
by Naga Rani Yarlagadda |
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని, మూడురోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని, మూడురోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో రాష్ట్రంలో మూడ్రోజులు అక్కడక్కడా మోస్తరు నుంచి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు, రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతోపాటు.. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
Next Story






